ఓడిపోయినా.. పాకిస్తాన్ పై ఇండియా సరికొత్త చరిత్ర?

praveen
సాధారణంగానే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు ఎంత హై ఓల్టేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా మ్యాచ్ వీక్షించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.   ఈ క్రమంలోనే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగానే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే ఉత్కంఠ వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటిది మ్యాచ్ చివరి బంతి వరకు కూడా విజయం ఎటువైపు వెళ్తుందో అని తెలియనంత  ఉత్కంఠగా జరిగితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులలలో ఉత్కంఠ కూడా  అమాంతం పెరిగి పోతూ ఉంటుంది.


 అయితే ఇటీవల ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా జట్టు. ఇక ఇటీవల పాకిస్థాన్తో సూపర్ 4 లో మరోసారి మ్యాచ్ ఆడింది. కేవలం వారం వ్యవధిలో రెండుసార్లు  దాయాదుల పోరు జరగడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే ఇటీవల సూపర్ 4 లో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది.  మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా రోహిత్ శర్మ 28 కె.ఎల్.రాహుల్ 28 పరుగులతో రాణించారు.


 రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా నిరాశపరిచారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత  లక్ష్య ఛేదనకు దిగిన  పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టార్గెట్ చేసింది. దీంతో విజయం సాధించింది.  అయితే భారత జట్టు ఓడిపోయినప్పటికీ భారత ఓపెనింగ్ జోడీ మాత్రం పాకిస్థాన్పై అరుదైన రికార్డు సృష్టించింది. మొదటి ఓవర్ నుంచి సిక్సర్లు పొరలతో చెలరేగిపోయిన నేపథ్యంలో తొలి వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఫలితంగా భారత్ పవర్ ప్లే లో ఒక వికెట్ కోల్పోయి 68 పరుగులు చేసింది. తద్వారా  టి20 లలో  పాకిస్థాన్పై భారత్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 2012లో పాకిస్తాన్పై భారత్ ఒక వికెట్  నష్టపోయి 48 పరుగులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: