పాకిస్తాన్ తో భారత్ "ఢీ".. విజయానికి వీరే అడ్డు ?

VAMSI
ఆసియా కప్ లో భాగంగా ప్రారంభ మ్యాచ్ లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ రోజు నుండి సూపర్ 4 స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా మొదటి మ్యాచ్ శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్యన సాయంత్రం జరుగుతుంది. ఇక వీక్ ఎండ్ ఎంటర్టైన్మెంట్ కోసం మరోసారి భారత్ పాకిస్తాన్ లు పోటీ పడనున్నాయి. దీనితో మరోసారి ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. పైగా రేపు సండే కావడంతో అందరూ ఎంతో ఆతృతగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. క మొదటి మ్యాచ్ లో ఓడిన పాక్, ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువును దక్కించుకోవాలని చూస్తోంది.

నిన్న హాంగ్ కాంగ్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ సునామీని తలపించే విధంగా రెచ్చిపోయి... రికార్డు విజయాన్ని సాధించి సగర్వంగా సూపర్ 4 లోకి అడుగు పెట్టింది. అయితే క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం రేపు జరగబోయే మ్యాచ్ లో ఎక్కువ శాతం పాకిస్తాన్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే పాక్ టీం లో మొదటి అతగాడి నుండి తొమ్మిదవ నెంబర్ ఆటగాడు వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు. పైగా నిన్నటి మ్యాచ్ తో అందరిలోనూ ఆత్మవిశ్వాసం వచ్చింది.

ఒకవేళ ఇండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే... ఓపెనర్ రిజ్వాన్, ఫఖార్ జమాన్ లను క్రీజులో కుదురుకోనివ్వకుండా చెయ్యాలి. ఇక నిన్నటి మ్యాచ్ హీరో ఖుష్ దిల్ షా, ఇఫ్తికర్ లకు బ్యాట్ జులిపించే అవకాశం ఇవ్వకూడదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే నసీం షా బౌలింగ్ ల తొందరపడకుండా షాట్ లు ఆడాలి. మహమ్మద్ నవ్వాజ్ బౌలింగ్ చాలా డేంజర్... కాబట్టి సింగిల్స్ రొటేట్ చేస్తూ చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలించాలి. మరి చూద్దాం ఈ ఆటగాళ్లను అడ్డుకుని పాకిస్తాన్ పై విజయం సాధించి వరుసగా రెండవసారి పై చేయి సాధిస్తుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: