ప్చ్.. నో బాల్ బంగ్లాదేశ్ కొంపముంచింది?

praveen
ఇటీవలే ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత  ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రూప్ బి లో లీగ్  దశలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా గ్రూప్ నుంచి సూపర్ ఫోర్ లో అడుగుపెట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది శ్రీలంక. ఇక చివరి బంతి వరకు కూడా ఈ మ్యాచ్ ఉత్కంఠగా  జరిగింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ పోరులో శ్రీలంక ఆటగాడు ఫెర్నాండో  మూడు బంతుల్లో 10 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.


 అయితే మొదట టాస్ ఓడిపోయినా బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేసింది.  ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది.  ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించింది  అనే చెప్పాలి. ఒకానొక సమయంలో ఇక శ్రీలంక ఓటమి ఖాయం అయిపోయింది అని ఎంతోమంది భావించారు. బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలు కూడా ఆ జట్టు ఓటమికి కారణం అయ్యాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక బంగ్లా జట్టుకు  నోబాల్ కొంపముంచింది అని చెప్పాలి.


 శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ బౌలర్లు ఏకంగా 4 నో బాల్స్  వేశారు.  తొలుత శ్రీలంక ఇన్నింగ్స్ ఏడవ ఓవర్ వేసిన మెహదీ హసన్ బౌలింగ్లో మొండిస్ వికెట్ కీపర్ కు  క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఇక బంగ్లాదేశ్ ఆటగాళ్లందరూ కూడా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు.  అంతలో ఊహించని షాక్.  ఆ బంతిని అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు.  దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆనందం క్షణాల్లో ఆవిరి అయింది.  ఆ తర్వాత చెలరేగిపోయిన మొండిS  భారీగా పరుగులు చేశాడు. ఇలా ఒక వేళ అది నోబెల్ కాకపోయి ఉంటే మొండిస్ అవుట్ అయ్యేవాడు. తద్వారా ఇక శ్రీలంక మరింత కష్టాల్లో పడిపోయేది. ఓడిపోయే  అవకాశాలు కూడా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: