వారెవ్వా.. 6 సిక్సర్లతో వరల్డ్ రికార్డ్?
ఇక ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 127 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టు ఆచితూచి ఆడుతూ ఎంతో అలవోకగా విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ నజీబుల్లా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 17 బంతుల్లోనే ఆరు సిక్సెర్లు ఒక ఫోర్ తో 43 పరుగులు చేశాడు. ఇక నజీబుల్లా కొట్టిన 6 సిక్సెర్ లతో ఏకంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని తెలుస్తోంది.
సాధారణంగా టి-20లో డేట్ ఓవర్లలో ఛేజింగ్ అంటే ఎంత ఒత్తిడితో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక డెత్ ఓవర్లలో ఛేజింగ్ చేస్తున్న బ్యాట్స్మెన్ సిక్సర్లతో చెలరేగి పోవడమే కాదు వికెట్ కోల్పోవటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం కొంత మంది మాత్రమే ఇలా బౌలర్ల పై వీరవిహారం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ నజీబుల్లాహ్ టి20 క్రికెట్ లో చేంజింగ్ లో డెత్ ఓవర్లలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా అగ్రస్థానంలో నిలిచాడు. డెత్ ఓవర్లలో నజీబుల్లా ఇప్పటివరకు 18 సిక్సర్లు కొట్టగా తర్వాత స్థానంలో ఇయాన్ మోర్గాన్ 17 సిక్సర్లు తర్వాత పెరీరా 16 సిక్సర్ లతో వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు.