దినేష్ కార్తీక్ చేసిన పనికి.. ఫిదా అవుతున్న నెటిజన్లు?

frame దినేష్ కార్తీక్ చేసిన పనికి.. ఫిదా అవుతున్న నెటిజన్లు?

praveen
ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించింది అంటే అందుకు కారణం టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగానే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు ఉత్కంఠ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అలాంటిది ఇటీవలే ఆసియా కప్ లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారిపోయింది. ప్రేక్షకులను కూడా మునివేళ్ళపై నిలబెట్టింది. ఇక ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రేక్షకుల ఊహకందని విధంగానే మారిపోయింది.




 నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివర్లో సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు హార్దిక్ పాండ్యా. దీంతో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయఢంకా మోగించింది టీమిండియా. టీమిండియా గెలుపు సమీకరణం నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. అంతలో రెండు బంతులు డాట్ బాల్ గా మారాయి.. ఇక మిగిలినవి కేవలం రెండు బంతులు మాత్రమే. ఉత్కంఠ మధ్య హార్దిక్ పాండ్యా మాత్రం ఎక్కడా తడబడ లేదు భారీ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అద్భుతమైన ఫినిషింగ్ టచ్  ఇచ్చిన హార్దిక్ పాండ్యా ను చూసి దినేష్ కార్తీక్ సైతం ఫిదా అయ్యాడు. అతని ముందు తల వంచి హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.


 అయితే తన సహచర ఆటగాడు ప్రతిభను ప్రశంసిస్తూ దినేష్ కార్తీక్ ఎంతో హుందాగా అభినందనలు తెలిపగ.. హార్దిక్ పాండ్యా చిరునవ్వులు చిందిస్తూ తన కళ్ళ తోనే కార్తీక్ కు సమాధానం ఇచ్చాడు అని చెప్పాలి. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫినిషింగ్ టచ్ విలువ ఏంటో ఇంకో ఫినిషర్ కే తెలుస్తుంది. హార్దిక్ ఆటతో హృదయాలు గెలిస్తే దినేష్ కార్తీక్ తన సంస్కారంతో అందరి మనసులనూ కొల్లగొట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: