టీమ్ ఇండియా ఫేస్ దళం.. సరికొత్త రికార్డ్?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఊహించినట్లుగానే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది. ఎవరు ఎవరి పై ఆధిపత్యం చెలాయించకుండా నువ్వా నేనా అన్నట్లు గానే పోరు జరిగింది. ఈ క్రమంలోనే ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో ఐదు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత బౌలింగ్ విభాగం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా వికెట్లు పడగొట్టి తో అటు పాకిస్థాన్ను కష్టాల్లోకి నెట్టింది.


 ఒకానొక సమయంలో 120 పరుగులు కూడా పాకిస్థాన్ జట్టు చేయగలుగుతుందా లేదా అనే అనుమానం అందరిలో కలిగింది. కానీ ఆ తర్వాత చివరి ఓవర్లో కొన్ని ఎక్కువ పరుగులు ఇవ్వడంతో 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది పాకిస్తాన్ జట్టు. అయితే టీమిండియా ఫేస్ విభాగమే ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. మొత్తంగ 10 వికెట్లు కూడా టీమిండియా ఫేస్ విభాగమే తీయడం గమనార్హం. భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో అదరగొట్టేసాడు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి తిరుగులేదు అని నిరూపించాడు.


 అర్ష దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. ఆవేశం ఖాన్ ఒక వికెట్ తీసి సత్తా చాటాడు అని చెప్పాలి. దీంతో టీమిండియా బౌలింగ్ విభాగం అరుదైన రికార్డు సృష్టించింది. టీమిండియా తరఫున టి20 క్రికెట్ లో అన్ని వికెట్లు కూడా ఫేస్ దళం తీయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు వెస్టిండీస్తో జరిగిన టి20 మ్యాచ్ లో 10 వికెట్లు స్పిన్నర్లు తీయడం గమనార్హం. భువనేశ్వర్ కుమార్ టి20లో పాకిస్తాన్పై కెరీర్లోనే బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులకే నాలుగు వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ పాండ్యా రెండోసారి మూడు వికెట్ల ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: