పాకిస్తాన్ పై.. ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే?
భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పాకిస్థాన్ తో 34 మ్యాచ్లు ఆడి యాభై నాలుగు వికెట్లు తీసి ఇక పాకిస్థాన్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే తర్వాత వెంకటేష్ ప్రసాద్ అత్యధిక వికెట్లతో కొనసాగుతూ ఉండడం గమనార్హం. భారత్ తరపున పాకిస్థాన్తో 23 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్పై నలభై మూడు వికెట్లు పడగొట్టాడు వెంకటేశ్ ప్రసాద్. ఒకానొక సమయంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదే దాయాది దేశం పై అతని అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
జవగళ్ శ్రీనాథ్ పాకిస్థాన్తో 36 మ్యాచ్లు ఆడాడు ఈ క్రమంలో 42 వికెట్లు పడగొట్టాడు. ఇక జవగళ్ శ్రీనాథ్ ఎకానమీ రేట్ ప్రతి ఓవర్ కి 5.04 గా ఉండేది. భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో తన బౌలింగ్తో ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. కపిల్ దేవ్ కూడా పాకిస్థాన్పై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ల జాబితాలో ఉన్నాడు. పాకిస్తాన్పై 32 మ్యాచ్లు ఆడిన కపిల్దేవ్ 42 వికెట్లు పడగొట్టాడు. ఇర్ఫాన్ పఠాన్ సైతం స్వింగ్ బౌలింగ్ తో పాకిస్థాన్ పై ఆధిపత్యం చెలాయించారు 23 వన్డేలు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ ముప్పై నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్పై అతని బౌలింగ్ ఎకానమీ రేటు ప్రతి ఓవర్ కి 5.37 పరుగులు గా ఉండడం గమనార్హం .