భారత్ - పాకిస్తాన్ మ్యాచ్.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కూ ప్రపంచ క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది అంటే అది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ గా కాదు ఎదో తెలియని ఎమోషన్ అన్నట్లుగానే క్రికెట్ ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అయితే మిగతా దేశాలతో ఆడినప్పుడు తమ జట్టు ఓడినా గెలిచినా పెద్దగా పట్టించుకోరు.. క్రికెట్ అన్న తర్వాత ఓటమి-గెలుపు సహజం అని చెబుతూ ఉంటారు. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం తప్పకుండా గెలవాలని ఆలోచనతో ఉంటారు. తమ జట్టుపై భారీగానే అంచనాలు పెట్టుకుంటారు.

 పొరపాటున తమ జట్టు ఓడిపోయింది అంటే ఇక చివరికి వారిని సోషల్ మీడియా వేదికగా విమర్శించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లు ఎంతో ప్రత్యేకంగా చూడటం  చేస్తూ ఉంటారు. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య పోరు గురించి ఇటీవలే మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లతో మైదానంలో మాత్రమే పోటీ ఉంటుందని ఒక్కసారి మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నదమ్ముల్లా మెలుగుతాము అంటూ చెప్పుకొచ్చాడు.

 స్టార్ స్పోర్ట్స్ షో లో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ ఆటను ఆటలా  చూడాలని సూచించారు. ఇండియా పాకిస్తాన్ జట్లు మైదానంలోకి దిగితే ఎంత పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది ఏ ఆటగాడు అయినా సరే అత్యుత్తమ ప్రతిభ కనబరిచాలి అని భావిస్తాడు. ఆ సమయంలో టీమిండియా క్రికెటర్ అయినా పాకిస్థాన్ జట్టు ఆటగాడు అయినా ఇద్దరూ తమ జట్టును గెలిపించేందుకు ఆడుతూ ఉంటారు. మైదానంలో ప్రత్యర్థులుగా  ఉండే.. మేము హోటల్ కి వెళ్ళగానే స్నేహితులలా కలిసి పోతాము. కానీ కొంతమంది మాత్రం భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి అని ఏదో ప్రచారం చేస్తారు. కాని నిజానికి అలాంటిదేమీ ఉండదు  అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: