భార్యతో విడాకులు.. స్పందించిన చాహల్?

praveen
క్రికెట్ లకు సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో గుప్పుమంటుంది . ప్రపంచం మొత్తం  పాకి పోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సదరు వార్త ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ అందరూ దాని గురించి చర్చించుకునేలా చేస్తూ ఉంటుంది. ఇలా క్రికెట్ ఆటకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇలా వైరల్ గా మారిన వార్తలలో కొన్ని నిజాలు ఉంటే కొన్ని మాత్రం పుకార్లు గానే మిగిలిపోతా ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ క్రికెటర్ చాహల్ గురించిన వార్త ఇటీవల సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 చాహల్ భార్య ధనశ్రీ వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో తన పేరు పక్కన చాహల్ అనే పేరును తొలగించింది. ఇది గమనించిన చాహల్ అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అదే సమయంలో కొత్త జీవితం లోడింగ్ అవుతుంది అంటూ అటు చాహల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఇది కాస్త మరింత సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. మరికొన్ని రోజుల్లో చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఇక ప్రచారం జరగడం మొదలైంది. ఇక నిజమే అనుకొని  అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.

 ఇక ఈ ప్రచారం ఎలా జరిగిందంటే.. ఏకంగా చాహల్ వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇటీవల తన విడాకుల గురించి వస్తున్న వార్తలపై చాహల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాను తన భార్య విడాకులు తీసుకోబోతున్నాము అంటూ వస్తున్న వార్తలు నిజం కాదు అంటూ చెప్పేసాడు. దయచేసి ఇలాంటి పుకార్లు ఎవరు నమోదు అంటూ కోరాడు. ఇంతటితో ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడితే బాగుంటుందని విజ్ఞప్తి చేశాడు. ఎట్టకేలకు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: