సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్.. బ్రేక్ చేస్తాడా?

praveen
మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరి కళ్ళు కూడా టీమిండియా పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఆసియా కప్ చరిత్రలోనే ఏకంగా ఏడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా కొనసాగుతోంది టీమిండియా. ఇప్పటివరకు ఎన్నో సార్లు ఆసియా కప్ లో భాగంగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అలవోకగా విజయం సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో అయితే మునుపెన్నడూ లేని విధంగా మరింత పటిష్టంగా కనిపిస్తుంది టీమిండియా.

 జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు మాత్రమే కాదు ఇక బెంచ్ స్ట్రెంత్ కూడా ఎంతో బలంగా ఉంది అని తెలిసింది. వెరసి ఆసియా కప్ లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని అందరూ ఎన్నో అంచనాలను పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఇక టీమిండియా కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారు ఆసియాకప్ లో పలు రికార్డులను సాధించి అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచేయాలని భావిస్తున్నారు అని చెప్పాలి. ఇక అలాంటి క్రికెటర్లలో రోహిత్ శర్మ కూడా ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ  కెప్టెన్గా తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. బ్యాట్స్మెన్గా కూడా మునుపటి జోరునే కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి.

 అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఆసియా కప్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి అని తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 971 తొలి స్థానంలో ఉన్నాడు. 883 రన్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. మరో 89 పరుగులు చేశాడు అంటే చాలా ఏకంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అలాగే మరో 117 రన్స్ చేస్తే ఆసియా కప్ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత క్లియర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఆసియా కప్ లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ లలో జయసూర్య 1220 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: