డకౌట్ అవ్వగానే.. ఐపీఎల్ ఓనర్ చెంప మీద కొట్టాడు : రాస్ టేలర్

praveen
ఎన్ని రోజుల వరకు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే వేధింపులు ఉంటాయి అని అందరూ అనుకునేవారు. సినిమాల్లో మాత్రమే బాడీ షేమింగ్ చేస్తారు అని భావించేవారు. కానీ క్రీడల్లో కూడా ఎంతో మంది ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వేధింపులు ఉంటాయన్న విషయాన్ని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ మీడియా వేదికగా చెప్పిన తర్వాత అందరికీ అర్థమవుతుంది అన్న చెప్పాలి. జట్టు తరఫున దాదాపు పదేళ్ళపాటు ప్రాతినిధ్యం వహించిన రాస్ టేలర్ ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

 ఈ క్రమంలోనే తన ఆటోబయోగ్రఫీ లో భాగంగా రాస్ టేలర్ చేస్తున్న షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి. న్యూజిలాండ్ జట్టులో ఎప్పుడు వివక్ష కొనసాగుతూనే ఉన్నాను. భారతీయ మూలాలు ఉన్న ఆటగాడిగా ఎంతోమంది చూసేవారు అంటూ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశాడు. బయటికి తన కెరీర్ సాఫీగా సాగిపోయినట్లు కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 ఒకసారి డకౌట్ అయినప్పుడు జట్టు యజమాని చెంప మీద కొట్టాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్  తరఫున ఆడుతున్న సమయంలో పంజాబ్ తో మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యాను. ఇలా డకౌట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లగానే జట్టు ఫ్రాంచైజీ ఓనర్ నా దగ్గరికి వచ్చి చెంపపై నాలుగు దెబ్బలు కొట్టాడు. నీకు మిలియన్ డాలర్స్ ఇచ్చేది డకౌట్ అవ్వడానికి కాదు అంటూ కొట్టాడు. ఆ తర్వాత ఒక్కసారిగా నవ్వాడు. అయితే అవి గట్టి దెబ్బలు కాకపోయినప్పటికీ అతను అలా చేయడంతో షాకయ్య.. ప్రొఫెషనల్ క్రికెట్ లో ఇలాంటివి ఏంటి అని అనుకున్నాను అంటూ రాస్ టేలర్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: