కాస్లీ కార్ కొన్న షమి.. ధర ఎంతో తెలుసా?

praveen
మహమ్మద్ షమీ ప్రస్తుతం టీమిండియా లో ఎంత కీలకమైన బౌలర్ గా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వింగ్ బౌలింగ్లో ఆధరగొడుతూ ఎప్పుడు మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలే టీమిండియాలో మూడు ఫార్మాట్లలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్న మహమ్మద్ షమీ టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మహమ్మద్ షమి కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 సాధారణంగా క్రికెటర్ ఎవరైనా ఖరీదైన వాచ్, వెహికిల్ లాంటివి కొనుగోలు చేసారంటే చాలు అదే అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషియం తెలిసిందే. కాగా ఇప్పుడు టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమి  కూడా ఒక కొత్త కారు కొనుగోలు చేశాడు అన్నది తెలుస్తుంది. జాగ్వార్ మోడల్ కారు షమి ఇంటికి వచ్చేసింది. జాగ్వార్ టైప్ మోడల్ ఎరుపు రంగులో ఉన్న కార్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఇంజన్ గరిష్టంగా 295 బిహెచ్పి పవర్ 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్ పుట్ ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ కారు ధర 98.13 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.


 టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమికి  కార్ల అన్న బైక్ లు అన్న బాగా ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఎప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాడు  ఇప్పటికే తన ఇంట్లో టయోటా ఫార్చునర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి కార్లు ఉన్నాయి. అంతేకాదు ఇటీవల ఐకానిక్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 సీసీ ని కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించి మరీ కొనుగోలు చేశాడు మహమ్మద్ షమి. ఇటీవలే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జాగ్వర్ కారు కూడా కొనడంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: