ఇంగ్లాండ్ లో గ్రౌండ్ కు.. టీమ్ ఇండియా లెజెండ్ పేరు.. వావ్?

praveen
సాధారణంగా క్రికెట్ మైదానాలకు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పేర్లు లేదా క్రికెటర్ల పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మన దేశంలో ఎన్నో క్రికెట్ మైదానాలకు ఇలా క్రికెటర్ల పేర్లు ఉన్నాయి. అయితే మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఆ దేశంలో దిగ్గజ క్రికెటర్ లుగా ఉన్న వారి పేర్లు  పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఒక దేశంలో దిగ్గజ క్రికెటర్ గా ఎదిగిన వ్యక్తి పేరు మరో దేశంలో మైదానానికి పెట్టడం అంటే అరుదైన గౌరవం అని చెప్పాలి. ఇక ఇటీవలే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కి ఇలాంటి అరుదైన గౌరవమే దక్కింది.

 ఇంగ్లాండ్లోని లిస్టర్ షైర్ క్రికెట్ గ్రౌండ్ కి సునీల్ గవాస్కర్ క్రికెట్ గ్రౌండ్ గా నామకరణం చేశారు. ఇప్పటివరకు హిస్టరీలోకి ఒక్కసారి తొంగిచూస్తే ఇంగ్లాండ్ లేదా యూరప్ గడ్డ పై ఉన్న క్రికెట్ గ్రౌండ్ కు ఒక ఇండియన్ పేరు పెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే  సునీల్ గవాస్కర్ ఈ అరుదైన ఘనతను సాధించి చరిత్రలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇటీవల లిస్టర్ షైర్ లో ఐదు ఎకరాల స్థలాన్ని సునీల్ గవాస్కర్ సొంతం అయ్యింది. ఈ క్రమంలోనే క్రికెట్లో అతను చేసిన సేవలకు లిస్టర్ షైర్  క్రికెట్ అసోసియేషన్ తమ క్రికెట్ గ్రౌండ్ కు గావస్కర్ గ్రౌండ్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

 ఇక తన స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం సునీల్ గవాస్కర్ లండన్లోనే ఉన్నాడట. ఇప్పటికే లీస్టర్ షైర్ గ్రౌండ్ లోని ఒక పెవిలియన్ ఎండ్ గోడపై సునీల్ గవాస్కర్ పెయింటింగ్ వేశారు. గావస్కర్ యువ క్రికెటర్ గా ఉన్న  సమయంలో ఎంతో స్టైల్గా చేతిలో బ్యాట్  భుజంపై పెట్టుకుని పోజు ఇచ్చిన ఫోటోని పెయింటింగ్ వేశారు. కాగా సునీల్ గవాస్కర్ పేరిట టాంజానియా, అమెరికాలో కూడా గ్రౌండ్ లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే లీస్టర్ షైర్ లో క్రికెట్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది.  ఎక్కువగా ఇండియన్ మూలాలున్న క్రికెటర్లు ఉంటారు. ఇక అక్కడ గ్రౌండ్ కు నా పేరు పెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అంటూ సునీల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: