
రుతురాజ్ కు షాక్.. ధావన్ తో ఓపెనర్ గా ఎవరంటే?
నేడు సాయంత్రం ఏడు గంటలకి వెస్టిండీస్ టీమ్ ఇండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మొదటి వన్డే మ్యాచ్ కి తన ప్లేయింగ్ ఎలెవెల్ జట్టును ప్రకటించాడు. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టు వివరాలు వెల్లడించారు ఆకాశ్ చోప్రా. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ కు జోడీగా రుతురాజ్ గైక్వాడ్ కి బదులు ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా బరిలోకి దిగితే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ మొదటి వన్డే మ్యాచ్లో ఆతిథ్య తుది జట్టు లో అవకాశం రాకపోవచ్చు అంటూ అంచనా వేశాడు.
రుతురాజ్ వన్డే అరంగేట్రానికి ఇంకా సమయం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడూ. మూడో స్థానంలో బ్యాటింగ్ కోసం శ్రేయస్ అయ్యర్ సరైన ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చిన ఆకాష్ చోప్రా.. అతడిని వెస్టిండీస్ బౌలర్లు ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. శ్రేయస్ అయ్యర్ షాట్ సెలక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని తెలిపాడూ. హార్థిక్ ఈ సిరీస్కు అందుబాటులో లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉందని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్ లకు చోటు ఇస్తానంటూ తెలిపాడు.
మొదటి వన్డే మ్యాచ్ కోసం ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు ఇదే :
శిఖర్ ధావన్, ఇసాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.