టీమ్ ఇండియాకి కోలుకోలేని గట్టి షాక్ తగిలింది.టాలెంటెడ్ బ్యాట్స్ మెన్ ఇంకా వైస్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ అనేది తగిలింది. విండీస్ పర్యటనకు ముందు కే ఎల్ రాహుల్ కరోనా వైరస్ బారిన పడినట్టు సమాచారం తెలుస్తుంది.ఇక గాయం కారణంగా సౌతాఫ్రికా ఇంకా అలాగే ఇంగ్లాండ్ సిరీస్‌లకు అతను దూరమైన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇటీవల జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్న కే ఎల్ రాహుల్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలో విండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే, టీ20 సిరీస్ జట్టుకు మాత్రం కే ఎల్ రాహుల్ ఎంపికవ్వడం జరిగింది. ఇక ఈ క్రమంలో ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేస్తున్న రాహుల్‌కు ఈ నెల 24 వ తేదీన ఫిట్‌నెస్ టెస్టు అనేది చేయాల్సి ఉంది. అంతలోనే ఇక కే ఎల్ రాహుల్ కరోనా బారిన పడటం జరిగింది. దాంతో అతను మొత్తం ఒక 7 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది.
ఇక ఆగస్టు 1 వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనేది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కే ఎల్ రాహుల్ కోలుకోవడంతోపాటు ఫిట్‌నెస్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కూడా అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇంకా అలాగే మరోవైపు, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్ తన టెస్టు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. చేయి గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కు కుల్దీప్ దూరమైన విషయం అందరికీ తెలిసిందే. విండీస్‌తో టీ20 జట్టులో భాగమైన కుల్దీప్ యాదవ్ ఇక తాజాగా ఫిట్‌నెస్ టెస్టు పూర్తి చేయడంతో టీ20 జట్టుతో కరేబియన్ పర్యటనకు వెళ్లనున్నాడు.కే ఎల్ రాహుల్ కి ఇలా కరోనా సోకడంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు బాధలో వున్నారు. కే ఎల్ రాహుల్ త్వరగా కోలుకోని మళ్ళీ మునిపటిలా మ్యాచ్ ఆడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.