వారెవ్వా.. రిషబ్ పంత్ అరుదైన రికార్డు?

praveen
రిషబ్ పంత్ గత కొన్ని రోజుల నుంచి కెరియర్లోనే పీక్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బౌన్సీ పిచ్లపై ఇంగ్లాండ్ బౌలర్లను రిషబ్ పంత్ ఎలా ఎదుర్కొంటాడో అని అనుకున్నప్పటికీ ఊహించిన దాని కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు రిషబ్ పంత్. సెంచరీలతో చెలరేగిన పోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ లో సెంచరీ చేసి అదరగొట్టిన రిషబ్ పంత్ ఇక ఇటీవల కీలకమైన వన్డే మ్యాచ్ లో కూడా మరోసారి సెంచరీతో రాణించాడు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే తన వన్డే కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు రిషబ్ పంత్. 261 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగింది భారత్. ఇలాంటి సమయంలోనే 74 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది భారత జట్టు. ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు భారీగా పరుగులు రాబట్టాడు. ఇక రిషబ్ పంత్ కి  హార్థిక్ పాండ్యా ఇన్నింగ్స్ కూడా తోడవడంతో ఎంతో అలవోకగా టీమిండియా టార్గెట్ బద్దలు కొట్టింది. కాగా రిషబ్ పంత్ హార్థిక్ పాండ్యా 133 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.


 ఈక్రమంలోనే రిషబ్ పంత్ ఒక అరుదైన రికార్డును సాధించాడు అనేది తెలుస్తుంది. తన వన్డే కెరీర్లో మొదటి సెంచరీ నమోదు చేసిన రిషబ్ పంత్.. ఆసియా వెలుపల  సెంచరీ సాధించిన మూడో భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. ఇక అంతకు ముందు రాహుల్ ద్రావిడ్ 147 పరుగులు కేఎల్ రాహుల్ 112 పరుగులతో ఈ అరుదైన రికార్డును సాధించారు. అంతేకాకుండా వన్డేలో సెంచరీ సాధించిన నాలుగో భారత వికెట్ కీపర్గా కూడా రిషబ్ పంత్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న భారత పర్యటనకు సౌత్ ఆఫ్రికా వచ్చిన సమయంలో సరిగా రాణించని రిషబ్ పంత్ టి20 వరల్డ్ కప్ లో చోటు ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఇప్పుడు పంత్ చేసిన ప్రదర్శనతో అతనికి వరల్డ్ కప్ లో చోటు ఖాయం గా మారిపోయింది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: