వరల్డ్ కప్ లో కోహ్లీకి స్థానం డౌటే.. మాజీ క్రికెటర్ ఏమన్నాడో తెలుసా?

praveen
విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు గురించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం చేర్చుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పరుగుల వరద పారించాడు. వరుస సెంచరీలు చేసి చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి మాత్రం పేలవమైన ప్రదర్శన చేస్తూ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. అత్యుత్తమ ఆటగాడు కావడంతో బీసీసీఐ కూడా అతని పక్కన పెట్టేందుకు ధైర్యం చేయడం లేదు. అంతేకాదు ఏ ఆటగాడికి ఇవ్వనని అవకాశాలు విరాట్ కోహ్లీకి ఇస్తూ వస్తున్నారు భారత సెలెక్టర్లు. అయినప్పటికీ అటు విరాట్ కోహ్లీ మాత్రం తనని తాను నిరూపించుకుని మళ్ళీ మునుపటి ఫామ్ లోకి రావడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు అని చెప్పాలి.


 ఇక ప్రతి మ్యాచ్లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి పేలవా ప్రదర్శనతో నిరాశ పరచడం లాంటివి చేస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. వరుసగా వైఫల్యం చెందుతూ ఉండటం.. అటు టీమిండియాకు కూడా మైనస్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేసే జట్టులో అటు ఇండియాలో  కోహ్లీకి స్థానం దక్కుతుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. వరల్డ్ కప్ లో ఆడబోయే టీమిండియా ఎలెవెన్ లో కోహ్లీకి స్థానం దక్కడం డౌటే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఇదే విషయంపై భారత బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ సబా కరీం  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టి20 ప్రపంచ కప్ కోసం ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడే జట్టులో విరాట్ కోహ్లీ స్థానం గురించి మాట్లాడటం సరైంది కాదు అంటూ వ్యాఖ్యానించాడు. టి20 ప్రపంచ కప్ అక్టోబర్ 16 వ తేదీన ప్రారంభం అవుతుంది. అందుకు చాలా సమయం ఉంది.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన సొంత యుద్ధంలో పోరాడుతున్నాడు.. ఇలాంటి సమయంలో టీం మేనేజ్మెంట్ విమర్శలను పట్టించుకోకుండా అతడు తిరిగి ఫాంలోకి వస్తాడని నమ్మకాన్ని అతనిలో కలిగించాలి అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ నేపథ్యంలో అతనికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: