మ్యాచ్ మధ్యలో కరోనా అని తేలింది.. ఏం చేశారంటే?

praveen
ప్రస్తుతం క్రికెట్ ఆటగాళ్లు అందర్నీ కూడా కరోనా వైరస్ నిబంధనల మధ్య  బయో బబుల్ లో ఉంచుతూ  వరుసగా మ్యాచ్ లు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం విజృంభిస్తునే ఉంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో ఆయా జట్లకు కీలక ఆటగాళ్లు దూరమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ పై కూడా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతుంది.


 ఆతిథ్య శ్రీలంక జట్టు కు చెందిన ఎంతో మంది ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతూ ఉండటం గా సంచలనంగా మారిపోయింది అనే చెప్పాలి  ఇలా వరుసగా ఒక్కో ఆటగాడు వైరస్ బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న నేపథ్యంలో అటు శ్రీలంక కు ఊహించని షాక్  లు తగులుతున్నాయ్. టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఓపెనర్ పతుమ్ నిస్సంక కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్ బారిన పడిన లంక ఆటగాళ్ళ సంఖ్య ఆరుకు చేరడం గమనార్హం. మూడో రోజు ఆట లో భాగంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు నిస్సంక.


 ఈ క్రమం లోనే వైద్య సిబ్బంది అతనికి రాపిడ్ యాంటిజెన్  పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చింది. అప్పటివరకు మ్యాచ్ ఆడిన అతను ఇక మధ్యలోనే వైదొలిగాడు. ఈ క్రమంలోనే నిస్సంక స్థానంలో ఓశడా ఫెర్నాండో సబ్స్టిట్యూట్ గా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి   అయితే తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏంజెలో మాథ్యూస్ కూడా ఇలాగే మ్యాచ్ లో కరోనా వైరస్ బారినపడి మైదానం నుంచివెళ్ళిపోయాడు. ఇలా ఆటగాళ్లు వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో దిగ్గజ ఆస్ట్రేలియాతో ఎదుర్కోబోయే లంక జట్టు బలహీనంగా మారిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: