బుమ్రా అరుదైన రికార్డు.. టి20 క్రికెట్ చరిత్రలోనే?

praveen
టీమిండియా జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బౌలింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు జస్ప్రిత్ బుమ్రా. వైవిధ్యమైన  బంతులతో అటు బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తున్నాడు అని చెప్పాలి. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి బంతిని కూడా ఎంతో వైవిధ్యంగా సందిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక బూమ్రా టీమిండియా ఆడే మూడు ఫార్మాట్లకు కీలక బౌలర్గా మారిపోయాడు.
 ఇక ఎన్నో రోజుల నుంచి అటు టీమ్ ఇండియా తరఫున డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా వికెట్ టేకర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా ఇటీవల జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో కూడా ఇది మరోసారి నిరూపించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మూడు ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇందులో  ఒక మేడిన్ ఓవర్ కూడా వేయడం గమనార్హం. ఈ క్రమంలోనే టీ-20  క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘనత సాధించాడు. టి 20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు 58 మ్యాచ్ల్లో 9 మెయిడిన్ ఓవర్లు వేశాడు ఈ ఫాస్ట్ బౌలర్.

 బుమ్రా అరుదైన రికార్డు సాధించిన నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో రెండవ ఆటగాడిగా జర్మనీకి చెందిన గులాం అహ్మద్ ఉన్నాడు. 23 మ్యాచ్ లలో 7 మేడిన్  ఓవర్లు వేసి అదరగొట్టాడు. బుమ్రా 2016 లో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్లో టీమిండియా లోకి అరంగేట్రం చేశాడు అనే విషయం తెలిసిందే.  టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన టాప్ టెన్ బౌలర్లలో  కేవలం ఇద్దరు భారతీయులు మాత్రమే ఉన్నారు. బుమ్రా తో పాటు మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ లిస్టులో ఉన్నాడు. ఇక 28 మ్యాచ్ లలో మెయిడిన్ ఓవర్లు వేశాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: