వారికి సవాల్ విసిరిన యూట్యూబర్ అన్వేష్.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ..?
ఇప్పుడు తాజాగా అన్వేష్ విడుదల చేసిన ఒక వీడియోతో వార్నింగ్ ఇచ్చారు. అన్వేష్ మాట్లాడుతూ ఇండియాకి వస్తాను ఇప్పటివరకు 130 దేశాలు తిరిగాను ఇంకా 70 దేశాలు ఉన్నాయి అంటే 2035 వరకు నా పాస్పోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత తాను రెన్యూవల్ చేసుకోవడానికి మాత్రమే ఇండియాకి వస్తానని, లేదు లేదు నేను ఇప్పుడే రావాలి.. నేను రావడం వల్ల అక్కడ దేశ అభివృద్ధి చెందుతుంది అంటే మీరే రప్పించుకోండి అంటూ మాట్లాడారు. మళ్లీ చెబుతున్న మీరు నా వెంట్రుకలు కూడా పీకలేరని సవాల్ విసిరారు.
నేను వస్తే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగానే ఉన్నారట. నన్ను విడిపించుకొని బయటికి రావడానికి నా దగ్గర లాయర్లు లేరా? నేనేమైనా మర్డర్లు చేశానా? లేదా వేరేది ఏదైనా చేశానా? సమాజానికి ఉపయోగపడే పనులే చేశాను. కొంత నోటి దూల ఉంది వాటిని ఇప్పుడు తగ్గించుకున్నాను. పెద్ద పెద్ద గోరాలు చేసిన వాల్లే మీసాలు మెలేసి తిరుగుతున్నారు. అలాంటిది నాకేం భయం లేదు మళ్లీ చెబుతున్న బత్తాయిలు మీరు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.