పంత్ ఫేస్ మాస్క్ తో ధోని.. ఫోటో వైరల్?
మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చే సలహాలు సూచనలు ప్రతి యువ ఆటగాడు ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటాడు. అయితే ఇటీవలే తన పుట్టినరోజు నాడు వింబుల్డన్లో సెమీఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ ఇక అటు ఇంగ్లాండ్ టి20 సిరీస్ ఆడుతున్న టీమిండియాతో కూడా కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాకుండా శని ఆదివారాల్లో ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగిన టీ-20 మ్యాచ్ లకు కూడా హాజరై సందడి చేశారు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే ఒక సాధారణ ప్రేక్షకుడిలాగా మ్యాచ్ ఎంజాయ్ చేశాడు అన్నది తెలుస్తుంది.
రెండో టీ20 సందర్భంగా యంగ్ వికెట్కీపర్ రిషబ్ పంత్ ఫేస్ మాస్క్ ను ముఖానికి పెట్టుకొని స్టేడియం లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే స్టాండ్స్ లో పంత్ తో కలిసి పోటి ఇచ్చిన మహేంద్రసింగ్ ధోని.. తర్వాత ఇక డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి యువ ఆటగాళ్లతో ముచ్చటించాడు. అయితే రిషబ్ పంత్ అటు ధోని వారసుడు అంటూ ఇండియన్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం పంత్ ధోని లాగే వికెట్ కీపర్ కావడం ఇక మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కావడం గమనార్హం. ఏది ఏమైనా ధోని రిషబ్ పంత్ మాస్క్ ధరించడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.