టి20 క్రికెట్ లో.. అత్యంత చెత్త రికార్డ్.. నాలుగు ఓవర్లు వేసి?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే అటు బ్యాట్స్మెన్ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే క్రికెట్ విశ్లేషకుల చెప్పడమే కాదు ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్ లలో కూడా ఇది నిజం అయింది అని చెప్పాలి  క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్మన్ కూడా చెలరేగి ఆడుతూ ఎన్నో రికార్డులు సృష్టించాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్లు విజృంభించి ఆడుతూ ఉండటంతో  బౌలర్ల  ఖాతాలో చెత్త రికార్డులు వచ్చి చేరి పోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్లు తో  విరుచుకు పడినప్పుడు ఒకే ఓవర్ లో భారీగా పరుగులు ఇచ్చిన రికార్డు సాధించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా బ్యాట్స్మెన్ల విధ్వంసానికి ఎంతో మంది బౌలర్ల ఖాతాలో ఎన్నో చెత్త రికార్డులు చేరిపోయాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక చెత్త రికార్డు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది   ఇంగ్లాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మేకరైన్  టి 20 క్రికెట్ చరిత్రలోనే ఇప్పుడు వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ  బ్లాస్ట్ టీ20 లో భాగంగా సోమర్సెట్, డర్బీ షేర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా నాలుగు ఓవర్లు వేసిన మేకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు వరకు టి20 చరిత్రలో నాలుగు ఓవర్లు వేసి ఇంత ఎక్కువగా పరుగులు సమర్పించుకున్న ఆటగాడు లేడు అని చెప్పాలి.


 దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 2011లో సూపర్ ఎలైట్ టి20 కప్ లో భాగంగా పాకిస్తాన్ బోర్డర్ శర్మద్ అన్వర్  పేరిట రికార్డు ఉండేది. నాలుగు ఓవర్లు వేసి 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం గా కొనసాగింది. ఇటీవల జరిగిన మ్యాచ్లో 82 పరుగులు సమర్పించుకుని  తన ఖాతాలో ఈ చెత్త రికార్డును వేసుకున్నాడు.ఇక ఇలా ఈ యువ ఆటగాడు సాధించిన చెత్త  రికార్డు గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: