గోల్ కొట్టింది.. లిప్ లాక్ ఇచ్చింది?
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో పై క్రీడాకారిణి అభిమానులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మహిళా హాకీ ప్రపంచ కప్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో భాగంగా ప్రస్తుతం అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మహిళల ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవలె గోల్ కొట్టిన ఒక క్రీడాకారిణి ఏకంగా అదే ఆనందంతో ఆమె బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసింది. అంతే కాదు గట్టిగా హత్తుకుని ఒక లిప్ కిస్ కూడా ఇచ్చేసింది. ఇలా హాకీ ప్రపంచ కప్లో భాగంగా పూల్ - ఏ లో నెదర్లాండ్, చీలి జట్లు తలపడ్డాయి.
అయితే ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు 3-1 తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ చీలే జట్టు ప్లేయర్ ఫ్రాన్సిస్కా కొట్టిన గోల్ ప్రత్యేకంగా నిలిచింది అని చెప్పాలి. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫ్రాన్సిస్కా నెదర్లాండ్స్ పై గోల్ కొడితే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాడని ముందే తన జట్టు సభ్యులతో చాలెంజ్ చేశా. అయితే చెప్పినట్లుగానే గోల్ కొట్టింది. దీంతో ఆనందంలో తన బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసి లిప్ కిస్ ఇచ్చింది. మీడియా సమావేశంలో కూడా ఆ క్రీడాకారిణి ముఖంలో పట్టలేని ఆనందం కనిపించింది అని చెప్పాలి.