రిషబ్ పంత్ ఆడుతుంటే.. హార్ట్ బీట్ పెరుగుతుంది : ద్రావిడ్

frame రిషబ్ పంత్ ఆడుతుంటే.. హార్ట్ బీట్ పెరుగుతుంది : ద్రావిడ్

praveen
ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో భాగంగా భారత్ కు నిరాశే ఎదురైంది అన్న విషయం తెలిసిందే.. ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో గెలిచి చారిత్రాత్మక విజయం సాధిస్తుంది అనుకుంటే చివరికి నాలుగో రోజు ఆటలో పట్టుకోల్పోయి విజయాన్ని ఇంగ్లాండ్ అప్పజెప్పింది. దీంతో సిరీస్ 2-2 తో సమం అయ్యింది. అయితే టీమిండియా ఓడినప్పటికీ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. 98 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 అయితే ఇటీవలే రిషబ్ పంత్ ఇన్నింగ్స్ స్పందించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. తనదైన శైలిలో రిస్కీ షాట్లు కొడుతూ  స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తాడు.  ఇక తనని అలాగే ఆడనివ్వాలి అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇక ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అతను వెనకడుగు వేయడు. ఇక ప్రతి ఒక్కరూ పంత్ శైలిని అంగీకరించక తప్పదు అంటూ చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయగల సత్తా పంత్  సొంతం అంటూ అతని ఆకాశానికెత్తేశాడు రాహుల్ ద్రవిడ్.


 ఇక ఒక్కోసారి  పంత్ రిస్క్ షాట్లు ఆడుతుంటే హార్ట్ బీట్  పెరిగిపోతుంది అంటూ రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. ఇక రిస్కీ షాట్స్ లో ఆడుతున్నప్పుడు పంత్ కు  జట్టు అంతా పూర్తిగా మద్దతు గా నిలుస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్. ఆడే షాట్లు అలవాటు చేసుకోవడం నేర్చుకున్నాము. ఇష్టమైన సమయంలో ఇలాంటి షాట్ ఆడకుండా  ఉంటే బాగుండు అని అనుకున్నప్పుడే  పంత్ రిస్కీ షాట్లు ఆడుతూ  ఉంటాడు. అలాంటప్పుడు గుండె వేగం పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: