ఇంగ్లాండ్ తో టెస్ట్.. కోహ్లీకి చివరి సారి బౌలింగ్ వేయనున్న దిగ్గజం?

praveen
క్రికెట్ అంటేనే బ్యాట్ కి బంతి కి మధ్య జరిగే వీరోచితమైన పోరాటం అన్న విషయం తెలిసిందే . ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. అయితే ఈ అనూహ్యమైన పోరాటంలో బ్యాట్ గెలవాలంటే వందల బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే బంతి గెలవాలంటే ఒకే ఒక టర్నింగ్ పాయింట్ చాలు. అందుకే ఇక క్రికెట్ అంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ప్రేక్షకులందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవల ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు హోరాహోరీగా మరోసారి పోరాడేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. వారు ఎవరో కాదు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇక వీరిద్దరిలో కొన్నిసార్లు జేమ్స్ అండర్సన్ పైచేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 2012లో 81 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ 23 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. 72 డాట్ బాల్స్ ఉండటం గమనార్హం. 2014లో అండర్సన్ బౌలింగ్ లో ఆడేందుకు విరాట్ కోహ్లీ ఎంతగానో ఇబ్బంది పడ్డాడు.50 బంతులు ఆడి నాలుగుసార్లు వికెట్ కోల్పోయాడు. 2014లో అండర్సన్  పైచేయి సాధించాడు. 2016లో మాత్రం కాస్త పుంజుకుని 112 బంతుల్లో 69 పరుగులు చేశాడు. 2018 లోనూ అండర్సన్ పై ఆధిపత్యం చెలాయించాడు కోహ్లీ.

 సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఆటలో మాత్రమే కాదు మాటల యుద్ధం కూడా వీరి మధ్య హోరాహోరీ గానే ఉంటుంది.  గత పర్యటనలో అజింక్య రహానేను లెగ్గిన్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన జేమ్స్ అండర్సన్ కు  గట్టిగా కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత అండర్సన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా తో బౌన్సర్లు కూడా వేయించాడు. 40 ఏళ్ల జేమ్స్ అండర్సన్ 171 టెస్టులో ఆడి ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.  టెస్టుల్లో 651 వికెట్లు కూడా తీశాడు. అయితే ఇక అండర్సన్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం ఇదే చివరి సారి కావచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే 40 ఏళ్ళ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: