రిషభ్ పంత్ కి శఠగోపమేనా... ఇంకో ఛాన్స్ లేదా ?

VAMSI
ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. రేపు గత సంవత్సరం టెస్ట్ సిరీస్ లో ఒక టెస్ట్ మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్ ను రేపటికి రీ షెడ్యూల్ చేసి ఐసీసీ నిర్వహిస్తోంది. అయితే ఈ టెస్ట్ తో పాటుగా రెండు టీ 20 అనధికారిక ప్రాక్టీస్ మ్యాచ్ లు , మూడు టీ 20  లు మరియు మూడు వన్ డే లు జరగనున్నాయి. అయితే మొన్నటి వరకు ఐర్లాండ్ వేదికగా జరిగిన రెండు టీ 20 లలో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని జట్టు ఘనవిజయాలు అందుకుంది. దీనితో హార్దిక్ పాండ్యపై ప్రశంశల వర్షం కురుస్తోంది. అందుకే ఐర్లాండ్ లో కెప్టెన్ గా సక్సెస్ అయిన హార్దిక్ పాండ్యానే ప్రాక్టీస్ మ్యాచ్ లకు కెప్టెన్ గా చేయనున్నాడు. ఇది బీసీసీఐ కంఫర్మ్ చేసింది.
కాగా ఈ టెస్ట్ అనంతరం జరగనున్న టీ 20 సిరీస్ కు కెప్టెన్ కోసం ప్రస్తుతం బీసీసీఐ తలమునకలవుతోంది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో జరిగిన టీ 20 సిరీస్ కు రిషబ్ పంత్ ను కెప్టెన్ గా చేసింది. కెప్టెన్ గా పరవాలేదు అనిపించినా బ్యాట్స్మన్ గా ఫెయిల్ అయ్యాడు. దీనితో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లకు అతనినే కొనసాగించాలా లేదా హార్దిక్ పాండ్యను ఎందుకోవాలా అన్న విసహయంపై ఇంకా క్లారిటీ లేదు. రేపు ఇందుకు సంబంధించిన టీం ను బీసీసీఐ సెలెక్ట్ చేయనుంది. మరి ఇండియా సెలెక్టర్లు మరోసారి రిషబ్ పంత్ కు శఠగోపం పెట్టి హార్దిక్ పాండ్యకు అవకాశం ఇస్తారా లేదా మరో ఛాన్స్ పంత్ కు ఇస్తారా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కాగా రేపు జరగనున్న టెస్ట్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం ప్రస్తుతం ఇండియా కన్నా ఇంగ్లాండ్ బలంగా ఉండడమే. అదీ కాకుండా ఈ టెస్ట్ లో రోహిత్ గైర్హాజరీలో ఇండియా కెప్టెన్ గా ఫాస్ట్ బౌలర్ బుమ్రా చేయనున్నాడు. దీనితో బుమ్రా ఏ విధంగా జట్టును నడిపిస్తాడు అని ఆసక్తిగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: