వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు.. కానీ టీ సర్వ్ చేస్తున్నాడు?

praveen
ఇటీవలి కాలంలో క్రికెట్ అనేది కాస్లీ ఆటగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఒక్కసారి దేశవాళి క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన తర్వాత క్రికెటర్ జీవితం మారిపోతుంది అని చెబుతూ ఉంటారు. ఎవరో చెప్పడం ఏంటి మనం కూడా ఇది కళ్ళారా చూస్తూనే ఉన్నాము.  కోట్ల రూపాయల సంపాదనతో మిడిల్ క్లాస్ జీవితం బ్రతికినవారు కాస్ట్లీ లైఫ్ కి అలవాటు పడి పోతూ ఉంటారు. ఇక అలాంటిది వరల్డ్ కప్ పాడిన జట్టులో స్థానం సంపాదించుకున్నాడు అంటే ఇక ఆ క్రికెటర్ కి తిరుగు లేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక క్రికెటర్ మాత్రం వరల్డ్ కప్  జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా  టీ అమ్ముకుంటూన్నాడు.

 అతను ఎవరో కాదు శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానమా. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  పాలకుల కారణంగా శ్రీలంక తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయింది.  దీంతో ఇక ఆర్థిక సంక్షోభం కారణంగా ఎగుమతులు దిగుమతులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పెట్రోల్ బంకుల వద్ద రోజులతరబడి లీటర్ పెట్రోల్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఇప్పుడు ఒక క్రికెటర్ టి, స్నాక్స్ పంచుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.  1996లో భారత వేదికగా జరిగిన ప్రపంచకప్ లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఇదే జట్టులో రోషన్ మహానమా సభ్యుడిగా ఉన్నాడు. ఐతే ఇటీవల శ్రీలంకలో పెట్రోల్ బంకుల వద్ద టి స్నాక్స్ సర్వ్ చేస్తూ కనిపిస్తున్నాడు.

 అయితే రోషన్ మహానమా తన బతుకు తెరువు కోసం ఇదంతా చేస్తున్నాడు అనుకుంటే పొరపాటే.. పేదలకు సహాయం చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు. లీటర్ పెట్రోల్ డీజిల్ కోసం పెట్రోల్ బంకు దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే విజేరమ మావాత వార్డు పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద నిరీక్షిస్తున్న ప్రజలకు తన టీం తో కలిసి మహానామ స్నాక్స్ సర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఈ ఫోటోలను వీడియోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. దీంతో అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tea

సంబంధిత వార్తలు: