ఇక నేను టీమిండియాకు ఆడలేను : వృద్ధిమాన్ సాహా

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వృద్ధిమాన్ సాహా ఇక ఇటీవల ఐపీఎల్ లో మాత్రం అవకాశం దక్కించుకుని మరోసారి నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన వృద్ధిమాన్ సాహా 11 మ్యాచుల్లో మూడు వందల 17 పరుగులు చేశాడు అని చెప్పాలి.  ఇక ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. ఇలా గుజరాత్టైటానిక్
 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఈ ప్రదర్శన ఆధారంగా టీమ్ ఇండియాకు ఎంపిక చేస్తారని వృద్ధిమాన్ సాహా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశాడు.

 కానీ అతనికి మాత్రం టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా కు ఎంపిక కాకపోవడం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సీనియర్ ప్లేయర్. టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమని ఇప్పటికే రాహుల్ ద్రావిడ్ తోపాటు సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు తనతో చెప్పారని.. నేనే ఆట పై మమకారం చంపుకోలేక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియాను ఎంపిక చేస్తారని అనవసరమైన ఆశలు పెట్టుకున్నా అని తెలిపాడు.  గత ఐపీఎల్ సీజన్ లో తన పర్ఫామెన్స్ కొలమానంగా తీసుకొని ఉంటే టీమిండియా తో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండేవాడిని అంటూ మనసులో మాట బయట పెట్టాడు.

 యువకులతో పోటీపడి మరీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా రాణించాను. అయినప్పటికీ టీమిండియాలో అవకాశం రాలేదంటే తాను ఇక టీమిండియాకు ఆడటం నిజంగానే కష్టమేమో అంటూ నైరాశ్యాన్ని వ్యక్తం చేశాడు వృద్ధిమాన్ సాహా. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత టెస్టు జట్టులో వికెట్కీపర్ గా ఉంటూ వచ్చాడు సాహ. ఆ తర్వాత మాత్రం పేలవమైన ఫామ్ కారణంగా వెనుకబడి పోయాడు.  అదే సమయంలో రిషబ్ పంత్ తెరమీదికి వచ్చి బాగా రాణించడంతో వృద్ధిమాన్ సాహా జట్టులో అవకాశం దక్కించుకోవడం మరింత కష్టం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: