ప్చ్.. పాపం బట్లర్.. రెండు బంతుల్లో వరల్డ్ రికార్డు మిస్?

praveen
సాధారణంగా వన్డే ఫార్మాట్ లో మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎంతో అలవోకగా సెంచరీ సాధించడం చూస్తూ ఉంటాము. కానీ అక్కడితో ఆగకుండా ఎంతో ధాటిగా ఆడుతూ 150 పరుగులు సాధిస్తే... అది కూడా అతి తక్కువ బంతుల్లోనే 150 పరుగులు చేస్తే ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. నెదర్లాండ్స్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న జోస్ బట్లర్ బౌలర్  లపై వీరవిహారం చేస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

 సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయిన జోస్ బట్లర్ 65 బంతుల్లో 150 పరుగులు సాధించాడు. ఇది తన పాత రికార్డులు తానే బద్దలు కొట్టుకున్నాడు. 2019 లో వెస్టిండీస్ తో ఆడిన మ్యాచ్ లో 77 బంతుల్లో 150 పరుగులు చేయగా.. ఇక ఇప్పుడు 65 బంతుల్లో 150 పరుగులు చేసి తన రికార్డులను బ్రేక్ చేసుకున్నాడు. అయితే ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 150 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన బట్లర్  రెండు బంతుల కారణంగా ప్రపంచ రికార్డును కోల్పోయాడు అని చెప్పాలి.. ఇంకో రెండు తక్కువ బంతుల్లోనే 150 పరుగులు సాధించి ఉంటే ఎబి డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించే వాడు.

 2015 ప్రపంచకప్ లో వెస్టిండీస్ తో ఆడిన మ్యాచ్ లో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే 150 పరుగులు చేశాడు. మిస్టర్ 360 ఎబి డివిలియర్స్ తక్కువ 64 బంతుల్లో 150 పరుగులు చేసిన రికార్డు అతని పేరిటే ఉంది. ఇక ఇప్పుడు 65 బంతుల్లో 150 పరుగులు చేసిన బట్లర్  మరో రెండు బంతులు తక్కువ ఉండగానే 150 పరుగులు చేసి ఉంటే ప్రపంచ రికార్డు సృష్టించే వాడు అని చెప్పాలి.  అయితే ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా జోస్ బట్లర్ అత్యధిక పరుగులు సాధించిన వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: