దినేష్ కార్తీక్ ఉండగా.. ఇక జట్టులో అతనెందుకు?

praveen
అనూహ్య పరిణామాల మధ్య రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు  అన్న విషయం తెలిసిందే. అయితే శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా మారిపోయిన రిషబ్ పంత్ కెప్టెన్గా కూడా ఆకట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఎందుకో ఒక ఆటగాడిగా కెప్టెన్ గా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. అయితే ఇటీవలే  రాహుల్ గాయం బారినపడి జట్టుకు దూరమవడంతో ఇక రిషబ్ పంత్ కెప్టెన్సీ చేపట్టాడు. ఇక మొదటి రెండు మ్యాచ్ లలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

 కాని ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో మాత్రం నేలను కొట్టిన బంతిలా మళ్లీ తిరిగి దూసుకొచ్చింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఘన విజయాన్ని  అందుకుని  2-2 తో సిరీస్ సమం చేసింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు టి20 మ్యాచ్ లో ఎంతో కీలకంగా మారిపోయింది. అంతా బాగానే ఉంది కానీ అటు రిషబ్ పంత్ ప్రదర్శన మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తుంది.  ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ లలో కూడా రిషబ్ పంత్ ఆడిన ఒక ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగినవి లేకపోవడం గమనార్హం. ఇలా మంచి ప్రదర్శన తో ఆకట్టుకోలేక పోతున్నాడు. అదే సమయంలో సీనియర్ దినేష్ కార్తీక్ మాత్రం  మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

 మూడవ టి20 మ్యాచ్ లో 12 బంతుల్లో 31 పరుగులు, ఇటీవల జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో 27 బంతుల్లో 55 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో జట్టులో వికెట్ కీపర్ గా,  సీనియర్ గా, కెప్టెన్సీ అనుభవం ఉన్న ప్లేయర్గా.. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్న దినేష్ కార్తీక్ ఉండగా ఇక రిషబ్ పంత్ జట్టులో ఎందుకు అంటూ కొంతమంది ఇండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూ ఉన్నారు. రిషబ్ పంత్ ను తప్పించి దినేష్ కార్తిక్ కు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: