టీమిండియాలో ఆ కవల పిల్లల తండ్రికీ.. ఇదే చివరి అవకాశం?
ఇక టీమిండియాలో సీనియర్ గా ఉన్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రిత్ బూమ్రా లాంటి వారికి విశ్రాంతి ఇవ్వగా ఐపీఎల్ లో అదరగొట్టిన ఎంతో మంది యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. అదే సమయంలో ఇక సీనియర్ అయిన దినేష్ కార్తిక్ కూడా అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ ఏడాది ఐపీఎల్లో తనలో ఉన్న అసలుసిసలైన ఫినిషెర్ ను బయటపెట్టాడు. బెంగళూరు జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు.. ఇక ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్ కు అసలు పరీక్ష మొదలైంది అన్నది తెలుస్తుంది.
ఐపీఎల్లో రాణించినట్లుగానే ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో రాణిస్తే అతడు టీమిండియా లో స్థానాన్ని కాపాడుకుంటాడు. లేదంటే ప్రస్తుత సమయంలో అతనికి టీమిండియాలో మరో అవకాశం రావడం కష్టమేనని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక కావడమే తన లక్ష్యమంటూ దినేష్ కార్తీక్ చెప్పాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇదే కసిని అటు మాటల్లో కాకుండా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో కూడా చూపిస్తే ఇక టీమిండియా టి20 వరల్డ్ కప్ జట్టులో దినేష్ కార్తీక్ కు చోటు తప్పకుండా దొరుకుతుంది. మరి ఈ కవల పిల్లల తండ్రి దినేష్ కార్తీక్ ఏం చేస్తాడో చూడాలి మరి..