టి20 సిరీస్.. ఆ ఇద్దరితోనే టీమిండియాకు డేంజర్?
అయితే గతంలో చివరి ద్వైపాక్షిక సిరీస్ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. అప్పుడు కూడా కె.ఎల్.రాహుల్ కెప్టెన్గా వుండగా.. చివరికి టీమిండియా ఓటమి పాలయింది. మూడు వన్డేల సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలోనే స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని కె.ఎల్.రాహుల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా భావిస్తోంది. అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రిత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు టీమిండియాకు దూరమైన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాత్రం బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించినా జట్టులోఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొట్టిన ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండడం గమనార్హం..
క్వింటన్ డికాక్,డేవిడ్ మిల్లర్, కగిసో రబాడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇక వీరి నుంచి అటు భారత జట్టుకు గట్టి పోటీ ఎదురవుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరి విషయంలో టీమిండియా ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించిన జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు క్వింటన్ డికాక్. ఇప్పుడు కె.ఎల్.రాహుల్ కు ప్రత్యర్థిగా ఎలా ఆడబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక గుజరాత్ లో డేవిడ్ మిల్లర్ కూడా అదరగొట్టాడు.