ఆ ఇద్దరి బ్యాటింగ్ చూసేందుకు ఎదురుచూస్తున్నా : సునీల్ గవాస్కర్

frame ఆ ఇద్దరి బ్యాటింగ్ చూసేందుకు ఎదురుచూస్తున్నా : సునీల్ గవాస్కర్

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు వరుసగా సిరీస్ లు ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో అటు సౌత్ ఆఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ క్రమంలోనే సొంత గడ్డపై భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో టీ20 ఆడబోతుంది. జూన్ 9వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది అనే చెప్పాలి. టీమిండియాలో సీనియర్ గా ఉన్న రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ లకు బిసిసిఐ విశ్రాంతి ఇచ్చింది. అంతే కాకుండా ఇటీవల ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ఆటగాళ్లను కూడా భారత జట్టులో స్థానం కల్పించింది.


 ఈ క్రమంలోనే ఇటీవల 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అధికారికంగా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే రోహిత్ కెప్టెన్సీ వహించిన  సమయంలో వైస్ కెప్టెన్ గా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇక ఇప్పుడు కెప్టెన్గా భారత జట్టును ముందుకు నడిపించ పోతున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టుకు టైటిల్ అందించి అదరగొట్టిన హార్దిక్ పాండ్యా కూడా జట్టులోకి వచ్చాడు. దీంతో ఇక సౌతాఫ్రికాతో టి20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే దానిపై సీనియర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 ఇకపోతే ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో సౌతాఫ్రికా లో జరగబోయే టి20 మ్యాచ్ సిరీస్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వికెట్ కీపర్ రిషబ్ పంత్ లు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇద్దరు బ్యాట్స్మెన్లు అలా బ్యాటింగ్ చేస్తే విధ్వంసం సృష్టించడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. చివరి ఆరు ఓవర్లలో ఇద్దరు నుంచి 100 నుంచి 120 పరుగులు ఆశించవచ్చు అంటూ తెలిపాడు. ఆ రేంజ్ లో పురుగులు చేయగల సత్తా వారి సొంతం అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఐదు, ఆరు స్థానాల్లో హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తే చూడాలని ఎదురుచూస్తున్న అంటు తెలిపాడు సునీల్ గవాస్కర్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: