మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను.. జట్టులో ఉండలేను?

praveen
దాదాపు 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించి అదరగొడుతుంది అని అందరూ అనుకున్నారు. లీగ్ దశ నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో కూడా సత్తా చాటుతోంది అని భావించారు. కానీ గుజరాత్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వార్న్ గురించి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా ఇక తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్గా  వ్యవహరించాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.


 ఈ క్రమంలోనే మొదటి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో కి తీసుకెళ్లి అక్కడ సత్తా చాటి ఐపీఎల్ టైటిల్ అందించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అప్పట్లో షేన్ వార్న్  రాజస్థాన్ కి కెప్టెన్ గా ఉన్న సమయంలో ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని మనోజ్ బాదాలే కు షాక్ ఇచ్చాడట. ఏకంగా ఒక జట్టులోకి ఒక ఆటగాడి ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం జరిగిందట. ఈ క్రమంలోనే షేన్ వార్న్ ఏకంగా జట్టు యజమానిని ఈ విషయంలో బెదిరించాడట. ఒకవేళ తాను చెప్పినట్టు వినకపోతే ఏకంగా జట్టు నుంచి తప్పుకుంటాను అంటూ హెచ్చరించడంతో ఇక మనోజ్ చేసేదేమీలేక సైలెంట్ గా నే ఉండిపోయాడట.


 ఇంతకీ  ఈ విషయాన్ని ఎవరూ చెప్పారు అని అనుకుంటున్నారు కదా.. ఎవరో చెప్పడం కాదు ఏకంగా దివంగత షేన్ వార్న్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు తన ఆటోబయోగ్రఫీ అయినా నోస్పిన్ లో ఈ విషయాన్ని రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆటగాడిని ఎంపిక చేయాలని మనోజ్ నన్ను కోరగా.. అతన్ని ఎంపిక చేస్తే జట్టులో నాకు విలువ ఉంటుందని అనిపించింది.  సరిగా ఆడకపోయినా జట్టులో ఉన్నాడు అంటే ఎవరో కావాలని అతనికి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మిగతా ఆటగాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకునే వీలు ఉంటుంది. నేను మిగతా ఆటగాళ్ల నమ్మకాన్ని కోల్పోతాను. అందుకే అతని జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అంటూ చెప్పినట్లు షేన్ వార్న్ నోస్పిన్ పుస్తకంలో రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: