ఫామ్ లో లేకపోతే అంతే.. కోహ్లీపై సెహ్వాగ్ కామెంట్స్?

praveen
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఎంత పేలవమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడు అనుకుంటే ప్రతి మ్యాచ్ లో కూడా తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి  నిరాశపరిచాడు. ఒక రకంగా బెంగళూరు జట్టు ఓటమికి అతనే కారకుడు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఏకంగా అభిమానులు సైతం విరాట్ కోహ్లీ ప్రదర్శన పై పెదవి విరుస్తున్నారు అని చెప్పాలి. కీలకమైన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఏడు పరుగులకే  వికెట్ చేజార్చుకోవటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఈ ఏడాది కోహ్లీ ఐపీఎల్ లో చేసినన్ని తప్పులు తన కెరీర్ మొత్తంలో చేసి ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లు ఫామ్ లో లేనప్పుడు ఆత్మ విశ్వాసం కోసం దొరికిన ప్రతి బంతిని కొట్టాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో తొలి ఓవర్లో అతను కొన్ని ఇబ్బందులను వదిలేసిన చివరికి దూరంగా వెళ్లే బంతులను కొట్టాలనుకున్న చివరికి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు.

 ప్రతి బంతిని ఆడినప్పుడే కొన్నిసార్లు అదృష్టం కలిసి రావచ్చు మరికొన్నిసార్లు రాకపోవచ్చు.. కోహ్లీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇలా కోహ్లీ ఐపీఎల్ సీజన్ లో చేసిన తప్పులు తన కెరీర్ మొత్తంలో చేసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను చెప్పుకొచ్చాడు. పేలవ ఫామ్ లో పరుగులు చేయలేక తంటాలు పడుతున్న ఆటగాళ్లు ఎవరైనా సరే ఇలా ఏవేవో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆడిన బంతి వదిలేయాల్సింది లేదా దంచి కొట్టాల్సింది కానీ కరెక్ట్ గా కనెక్ట్ చేయలేక వికెట్ కోల్పోయాడు అంటు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: