బాబోయ్.. పటిదార్ పెళ్లి వాయిదా వేసుకున్నాడట?

praveen
ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు,  లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు విజయం సాధించి ముందడుగు వేసింది. ఓటమితో లక్నో జట్టు నిరాశతో ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడానికి డుప్లెసిస్ లేదా విరాట్ కోహ్లీ.. లేదా మాక్స్వెల్, దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లు కారణం అవుతారు అని ప్రేక్షకులు భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టని యువ ఆటగాడు రజత్ పటిదార్ బెంగళూరు విజయానికి కారణం అయ్యాడు.

 అటు లక్నో బౌలర్లతో  ఒక ఆట ఆడుకున్నాడు. సిక్సర్లు ఫోర్లతో వీరవిహారం చేశాడు అని చెప్పాలి. బౌలర్ ఎవరైనా బంతి ఎక్కడ వేసిన బౌండరీ తరలిస్తూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఈ యువ ఆటగాడు ప్రతిభ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి  సోషల్ మీడియాలో అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు కూడా గూగుల్ లో తెగ వెతికేస్తున్నారూ. ఈ క్రమంలోనే ఇటీవలే ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయానికి కారణమైన యువ క్రికెటర్ రజత్ పటిదార్  గురించి ఒక విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఏకంగా 54 బంతుల్లో 112 పరుగులు చేసి ఒక్కసారిగా ఐపీఎల్ హీరోగా మారిపోయిన రజత్ పటిదార్ ను ఎవరు మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. కాగా ఇక మే 9వ తేదీన అతను పెళ్లి చేసుకోవాల్సి ఉందట. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మే 9వ తేదీన జరగాల్సిన పెళ్లిని అతను వాయిదా వేసుకున్నాడట. నవనీత్ సిసోడియా గాయం బారినపడి జట్టుకు దూరం కావడంతో ఇక రజత్ పటిదార్ కు  ఆర్సిబి నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇక పెళ్లిని వాయిదా వేసుకొని జట్టు క్యాంపులో చేరిపోయాడు. సత్తా చాటి ఐపీఎల్ హీరోగా మారాడు. ఐపీఎల్ తో పాటు రంజి ట్రోఫీ ముగిసిన తర్వాత జూలైలో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: