ఒకే మ్యాచ్ లో రెండు రికార్డులు.. వారెవ్వా జోస్ బట్లర్?

praveen
ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో మరోసారి గుజరాత్ టైటాన్స్ విజయ పరంపర కొనసాగింది. రాజస్థాన్ ను ఓడించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది గుజరాత్ జట్టు. ఈ క్రమంలోనే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైర్ 2 లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే ఇటీవల తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్మెన్ మాత్రం రెండు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.

 ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో తన బ్యాట్ తో జోస్ బట్లర్ సృష్టిస్తున్న విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇప్పటివరకు ఐపీఎల్లో  718 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఒకే సీజన్లో ఏడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆరవ బ్యాట్స్మెన్ గా జోస్ బట్లర్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2016లో విరాట్ 973 పరుగులు, 2016 లో డేవిడ్ వార్నర్ 848 పరుగులు, 2018లో కేన్ విలియమ్సన్ 735 పరుగులు, 2013లో మైఖేల్ హస్సి 733 పరుగులు, 2012లో క్రిస్ గేల్ 733 పరుగులు మాత్రమే సాధించారు. ఇక ఇప్పుడు జోష్ బట్లర్ ఈ లిస్టులో చేరిపోయాడు.

 అంతేకాదండోయ్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇప్పటివరకు టి-20లో 8051 పరుగులు సాధించాడు జోస్ బట్లర్. ఈ క్రమంలోనే టీ-20లో 8,000 పరుగుల మార్కును అందుకున్న మూడో బ్యాట్స్మెన్గా రికార్డ్ సృష్టించాడు. అతని కంటే ముందు అలెక్స్ హేల్స్, లుక్ రైట్ ఉన్నారు. ఇక బట్టలు తర్వాత కేఎల్ రాహుల్ లైఫ్ 537 డీకాక్ 502 పరుగులతో ఇక ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు గా  టాప్ లో కొనసాగుతున్నారు అని చెప్పాలి. ఇటీవలే  జోస్ బట్లర్ గుజరాత్ పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరికి రాజస్థాన్ కి ఓటమి తప్పలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: