ఐపీఎల్ : టేబుల్ టాపర్స్ మధ్య పోరు.. ఎవరు గెలుస్తారో?

praveen
ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటివరకు 55 మ్యాచ్లు పూర్తి కాగా మరో 15 మ్యాచ్ లు మాత్రమే జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రతి జట్టు బరిలోకి దిగుతుంది. ఇంకా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న అన్ని జట్లు ఇక ఆ దిశగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.


 కాగా నేడు సాయంత్రం 7:30 గంటలకు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుంది. టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ రెండు జట్లు కూడా ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాయ్ అనే చెప్పాలి. అంతేకాదండోయ్ ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ సీజన్ తోనే ప్రస్థానం మొదలు పెట్టాయ్. ఇక మొదటి సీజన్లోనే సత్తా చాటుతూ ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుని కె.ఎల్.రాహుల్ ముందుకు నడిపిస్తూ ఉండగా అటు గుజరాత్ టైటాన్స్ జట్టును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. కాగా నేడు ఈ రెండు జట్ల మధ్య కీలక పోరు జరగబోతుంది.


 అయితే ప్రస్తుతం వరుస విజయాలతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అదరగొట్టింది. పూర్తి జోరు మీద ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు మాత్రం మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోయింది. కానీ గత రెండు మ్యాచ్లలో  మాత్రం ఓడిపోయింది. దీంతో తిరిగి ఫామ్లోకి రావాలని భావిస్తోంది. దీంతో టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న ఈ రెండు జట్ల లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ కోసం ఐపిఎల్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: