
పెళ్లి తర్వాత అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు : మొయిన్ అలీ
ఐపీఎల్ లో కొత్త గా ఎంట్రీ ఇచ్చిన జట్లకు సైతం కనీస పోటీ ఇవ్వలేక చతికిలబడి పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇలాంటి సమయంలోనే రవీంద్ర జడేజా మరోసారి కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. దీంతో ఇక ధోనీ కెప్టెన్సీలో మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ గాడిలో పడింది అని తెలుస్తోంది. వరుసగా విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది. ఇక ఇటీవల ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే జట్టు విజయంలో అటు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డేవిడ్ కాన్వె అద్భుతంగా రాణిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన వరుసగా మూడు మ్యాచ్ల్లో కూడా మూడు హాఫ్ సెంచరీ చేసాడు అతడు. ఈ క్రమంలోనే ఓపెనర్గా మంచి పరుగులు రాబడుతున్నా డేవిడ్ కాన్వె పై చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే పెళ్లి కావడం డేవిడ్ కాన్వె కి బాగా కలిసి వస్తుంది. పెళ్లి అయినప్పటినుంచి అతను మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. డేవిడ్ కాన్వె అద్భుతమైన ఆటగాడు మంచి షాట్ లు కొట్టగలడు అంటూ మోయిన్ అలీ ప్రశంసలు కురిపించాడు కాగా డేవిడ్ కాన్వె ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచ్ లలో 87, 55, 85 పరుగులు సాధించాడు.