ఐపీఎల్ : నేడు మరో ఆసక్తికర పోరు.. ఎవరు గెలుస్తారో?
కాగా ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం మూడు విషయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి కొన సాగుతోంది. ఇక ఇటీవల కాస్త గాడిలోకి వచ్చినట్లు అనిపించింది ముంబై ఇండియన్స్. కాగా నేడు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. కాగా ఇప్పుడిప్పుడే గాడిలో పడి వరుస విజయాలను ముంబై ఇండియన్స్ సాధిస్తూ ఉంటే వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు పదవ స్థానంలో ఉంది. కాగా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. కాగా ఈ ఏడాది పేలవ ప్రదర్శన కనబరిచిన ఈ రెండు జట్లలో ఎవరు పైచేయి సాధించి విజయం సాధిస్తారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య గణాంకాలు చూసుకుంటే అటు ముంబై ఇండియన్స్ కాస్త ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు ఒకప్పటిలా లేవు. అందుకే ఈ మ్యాచ్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగి పోతుంది.