తాజ్ మహల్ హీరోయిన్ చేసిన పనికి.. ముస్లింలు ఆగ్రహం..!
ముస్లిం మహిళ అయ్యి ఉండి నుష్రత్ మహాకాల్ ను సందర్శించడం పైన చాలా మంది ఇమెను వేలెత్తి మరి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మత పెద్దలు కూడా ఈమె చేసిన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం జయాత్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ.. షరియా చట్టం ప్రకారం ఆమె గంధం పూసుకోవడం, పూజలు చేయడం వంటివి ఘోరమైన పాపమంటూ తెలియజేశారు. ఇలాంటి చర్యలు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటాయంటు తెలియజేశారు. నుష్రత్ చేసిన పనికి పశ్చాత్తాపం చెంది కల్మ పాటించాలంటూ జాతీయ అధ్యక్షుడు మౌలానా డిమాండ్ చేశారు. కానీ ఈ వివాదం పైన ఈమె ఇంకా స్పందించలేదు.
నుష్రత్ ఇలా ఆలయాన్ని దర్శించడం ఇదేమి మొదటిసారి కాదని గతంలో కూడా ఇలా ఎన్నోసార్లు ఆమె హిందూ దేవాలయాలను సందర్శించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి విషయాలపైన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.. ముఖ్యంగా ఆలయం లేదా మసీదు లేదా చర్చి వంటి స్థలాలలో శాంతిని పొందడాన్ని తాను నమ్ముతానని తెలియజేసింది. మీకు ఎక్కడ శాంతి లభిస్తే అక్కడికి వెళ్ళండి.. ఆ మందిరంలో నైనా, గుడి ద్వారాలలో అయినా, చర్చిలో అయినా వెళ్ళండి అంటూ బహిరంగంగా చెప్పేసింది.