మటన్ త్వరగా ఉడకడం లేదా.. ఈ చిట్కాలు పాటించండి?

praveen
వారంలో ఎన్ని రోజులు ఉన్నా అటు సండే మాత్రం ప్రతి ఒక్కరికి స్పెషల్. ఇక ప్రతి ఒక్కరికీ సెలవు దినం కూడా సండే కావడం గమనార్హం. అందుకే ఇక ఆదివారం రోజు ఏకంగా పండుగ రోజుగా భావిస్తూ ఉంటారు ఎంతోమంది. అందుకే సండే వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి మాంసం తెచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఎక్కువగా అయితే  ఆదివారం రోజున మటన్ ఇంట్లోకి తెచ్చుకొని ఫ్యామిలీ అందరూ కలిసి ఎంతో సంతోషంగా తింటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే కొన్ని కొన్ని సార్లు మటన్ త్వరగా ఉడికిపోతు ఉంటుంది. కానీ మరి కొన్నిసార్లు మాత్రం సరిగా ఉడకక పోవడంతో ఇబ్బందులు పడుతూ వుంటారు. ఇక ఇలాంటి సమయంలోనే మటన్ ఎందుకు ఉడకడం లేదో అర్థం కాక అయోమయంలో పడి పోతూ ఉంటారు. ఇక ఎంతసేపు అటు కుక్కర్లో పెట్టి  విజిల్స్ వస్తూ ఉంటాయి  తప్ప మటన్ మాత్రం ఉడకదు అని చెప్పాలి. దీంతో మటన్ ఉడికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి నానా తంటాలు పడుతుంటారు. అయితే ఇలా మటన్ ఉడుకుతున్నప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో మంచిది అని తెలుస్తూ ఉంది. ఇక ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 మటన్ త్వరగా ఉడికేందుకు మాంసాన్ని కడిగి నీళ్లన్నీ ఒంపు కోవాలి ఆ తర్వాత ఆ మాంసం లో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెడితే సరిపోతుందట. ఇలా గంట తర్వాత తీసి ఇక మటన్ వండితే ఎంతో త్వరగా ఉడికిపోతుందట. అంతేకాదండోయ్ ఇక మాంసం లో నిమ్మకాయ పిండిన తర్వాత కాసేపు ఉంచి వండిన కూడా త్వరగా మటన్ ఉడికి పోతుందట. ఇలా ఈ రెండు చిట్కాలు పాటిస్తే ఎంతో సులభంగా మటన్ ఉడికించ వచ్చట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆదివారం రోజున ఇలాంటి చిట్కాలు పాటించి.. మటన్ ఉడికించండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: