ఐపీఎల్ ఎన్నో పాఠాలు నేర్పింది : కోహ్లీ

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన విరాట్ కోహ్లీ  ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను నెలకొల్పినా కోహ్లీ రికార్డుల రారాజుగా ప్రేక్షకులతో ముద్దుగా పిలిపించుకుంటూ ఉంటాడు.  అంతేకాదు ఎన్ని పరుగులు చేసిన అప్పుడే  కొత్తగా మ్యాచ్ ఆడుతూన్నట్లుగా పరుగులు సాధించాలనే కసితో కనిపింఛే విరాట్ కోహ్లీని పరుగుల యంత్రం అని ఎంతోమంది పిలుస్తూ ఉంటారు ప్రేక్షకులు.



 కాగా ప్రస్తుతం ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే ఎందుకో అనుకున్నంత స్థాయిలో మెరుగైన ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు అని చెప్పాలి. ఒకవైపు అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న..  విరాట్ కోహ్లీ మాత్రం ప్రతి మ్యాచ్లో పేలవా ప్రదర్శన చేస్తూ అభిమానులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.



 క్రికెట్ లో విజయం సాధించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విభిన్న మార్గాలను చూపించింది అంటూ టీమిండియా మాజీ కెప్టెన్  ఆర్సిబి ప్లేయర్ విరాట్ కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  తన ఆటపై అవగాహన పెంచు కోవడానికి భిన్నమైన కోణాన్ని జోడించండి అంటూ తెలిపాడు. టీమిండియా కాకుండా నా సామర్థ్యాల ప్రదర్శనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా నిలిచింది అంటూ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడటంతో పాటు వారితో కలిసి జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కల్పించింది అంటూ తెలిపాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: