కోల్కత్తా జట్టులో ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు : ఆర్పీ సింగ్
ఇలా కొత్త బ్యాటింగ్ కాంబినేషన్ సెట్ కాకపోవటంతో కాని తరచూ కాంబినేషన్లో మార్చడం వల్ల జట్టుపై బ్యాటింగ్ తీవ్రంగా దెబ్బతింటుంది అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు. కాగా నేడు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మైదానం వెలుపల ఉన్న మనం ఏదేని జట్టు కూర్పు గురించి అంచనా వేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలా అత్యుత్తమ తుది జట్టును మనం ఎంచుకుంటూ ఉంటాం. కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇక జట్టు మేనేజ్మెంట్ కి ఏమైందో అర్థం కావడం లేదు. ఎన్ని మార్పులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాము. వెంకటేష్ అయ్యర్ టాపార్డర్ నుంచి మిడిలార్డర్ కు పంపారు. తర్వాత మళ్ళీ ఓపెనర్‌గా తీసుకువచ్చారు. నితీష్ రాణా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. కోల్కత్తా నైట్ రైడర్స్ లో ఏ ఒక్క బ్యాటర్ కైనా ఖచ్చితమైన పొజిషన్ ఉందా అంటూ ఆర్పి సింగ్ ప్రశ్నించాడు