అప్పుడు కన్ఫ్యూషన్.. ఇప్పుడు కతర్నాక్ : ఆకాశ్ చోప్రా

praveen
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇచ్చాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ నిర్వాహకులు మెగా వేలం నిర్వహించారు. మెగా వేలం కారణంగా అన్నీ జట్లు కూడా తమ ఆటగాళ్ళను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇక అన్నీ జట్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక మెగా వేలం సమయంలో ప్రతి ఫ్రాంచైజీ కూడా తమదైన వ్యూహాలతో జట్టుకు అవసరమైన ఆటగాళ్లను టీమ్ లోకి తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  మెగా వేలం సమయంలో రెండు జట్లు తమ ఊహలతో అందరినీ ఆశ్చర్యపరిచాయి.


 కానీ ఇప్పుడు ఆ రెండు జట్ల ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తూ ఉండటం గమనార్హం. మరీ ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఎక్కువగా విదేశీ బ్యాట్స్మెన్లను కొనుగోలు చేసింది. అలాంటి వాళ్ళు ఇక్కడి పిచ్లపై ఏమాత్రం రాణిస్తారు అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ మినహా మెరుగైన బౌలర్ ఎవరూ లేరు. దీంతో సన్రైజర్స్ వ్యూహం గజిబిజిగా అనిపించి. కానీ ఇప్పుడు మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది అంటూ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు గురించి మాట్లాడాడు.


 గుజరాత్ టైటాన్స్ జట్టు వ్యూహం మెగా వేలం సమయంలో ఎంతో కన్ఫ్యూజన్ గా ఉంది. కానీ ఇప్పుడు జట్టు ప్రదర్శన  అద్భుతంగా ఉంది. అయితే సాధారణంగా డబ్బు ఉంటే ఎవరైనా స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ లో పెడతారు  అయితే గుజరాత్ మాత్రం రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపింది. రషీద్ ఖాన్,  జోసెఫ్ లాంటి వాళ్ళను కొనుగోలు చేసింది అంటు ఆకాష్ చొప్రా తనదైన శైలిలో చమత్కరించాడు. ఇలా మెగా వేలం  సమయంలో కన్ఫ్యూజ్ చేసిన రెండు జట్లు ఇక ఇప్పుడు మాత్రం అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్ అంటూ చెప్పుకొచ్చాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: