మాకు నమ్మకం లేదు దొర.. కోహ్లీ ఆటపై ఫ్యాన్స్?

praveen
కోహ్లీ.. నువ్వు ఇలా ఆడుతున్నావ్ ఏంటయ్యా.. ఆడటం ఏమైనా మరిచిపోయావా లేకపోతే.. ఆడటం రావట్లేదా.. నువ్వు సాధించిన రికార్డులు చూసి నీ మీద విమర్శలు చేయాలి అనిపించడం లేదు కానీ.. ఇప్పుడు నువ్వు ఆడుతున్న తీరు చూసి మాత్రం విమర్శలు చేయకుండా  ఉండలేకపోతున్నా.. మరీ ఇంత దారుణంగా ఆడితే ఎలా.. జట్టుకు భారంగా మారిపోతున్నావ్ ఒకసారి ఆలోచించుకో.. ప్రస్తుతం ప్రతి ఒక్క కోహ్లీ అభిమాని ఇదే అనుకుంటూ ఉన్నాడు. కోహ్లీ ఆట తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు.

 ఒకప్పుడు అత్యుత్తమ క్రికెటర్ బాగా రికార్డులు సాధించా. రన్ మెషిన్ గా కూడా పేరు సంపాదించుకున్నా అనుకుంటే సరిపోదు.. ఎప్పుడు మంచి ప్రదర్శన చేయాలి.. ఫామ్ లో కొనసాగనప్పుడు ఎప్పుడూ జట్టుకు మారగానే మారిపోతుంటారు. ఇక విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు కోహ్లీ అభిమానులు. ఎందుకంటే గత రెండు మ్యాచ్లలో డకౌట్ గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ ఇక రాజస్థాన్లో జరిగిన మ్యాచ్ లో పది బంతుల్లో 9 పరుగులు చేశాడు. అంతేకాదండోయ్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆడిన 9 మ్యాచులలో చేసింది 128 పరుగులు మాత్రమే.

 ఇక ఇందులో అత్యధిక స్కోరు 48 మాత్రమే కావడం గమనార్హం. ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఇలాంటి ప్రదర్శన చేయడంపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఎంతో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు కొన్ని రోజులపాటు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లేదంటే ఇక కోహ్లీ క్రికెట్ కెరియర్ కి దెబ్బ పడే అవకాశం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులైతే కోహ్లీ ఆడుతాడు అన్న ఆశలు వదిలేసుకున్నారు అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: