బీసిసిఐ సంచలనం.. బయో బబుల్ లేకుండానే మ్యాచ్ లు?

praveen
కరోనా వైరస్ సాధారణంగా క్రీడా ప్రపంచం మొత్తం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు వరుసగా మ్యాచ్ లతో బిజీ బిజీగా ఉండే ఆటగాళ్ళను  కొన్ని నెలల పాటు అటు ఇంటికే పరిమితం చేసింది కరోనా వైరస్. ఈ క్రమంలోనే  అన్ని క్రీడలకు సంబంధించిన మ్యాచ్ లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అటు క్రికెట్ మ్యాచ్ లు కూడా ఆగిపోవడంతో క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో నిరాశ చెందారు. అయితే కొన్నాళ్ల వరకూ కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుంది అని ఎదురుచూసిన ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. ఎంతకీ వైరస్ ప్రభావం తగ్గక పోవడంతో ఇక కొత్త మార్గాలను వెతికారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే కరోనా వైరస్ కు ముందు నిర్వహించినట్లు గా ప్రేక్షకుల అందరి మధ్య మ్యాచ్ లు నిర్వహించడం కాకుండా ఆటగాళ్లు అందరిని కూడా ఒక హోటల్ రూం కి పరిమితం చేసి.. బయో బబుల్ పద్ధతిలో ఇక మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే ఇక అప్పటి నుంచి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఆటగాళ్లను కేవలం క్వారంటైన్ కి మాత్రమే పరిమితం చేశాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో ప్రేక్షకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే బిసిసిఐ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది.


 ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లను బయో బబుల్ నిబంధనల మధ్య నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ జూన్ 9 నుంచి 19 వరకు టీమిండియా ఆడబోయే సౌతాఫ్రికా పర్యటన కొరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ను బయో బబుల్  లేకుండానే నిర్వహించే ఆలోచనలో ఉంది అని బిసిసీఐ అధికారి ఒకరు సూత్రప్రాయంగా చెప్పడం గమనార్హం. కఠినమైన నిబంధనలను ఎత్తివేస్తామని చెప్పుకొచ్చారు. సుదీర్ఘకాలం బయో బబుల్ లో ఉండడం కష్టమైన పని అని ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా దీనిపై అటు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: