2వేల కోడి పిల్లలు కొన్ని ధోని.. ఎందుకో తెలుసా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఏం చేసినా సోషల్ మీడియాలో సెన్సేషనల్ గానే  మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోనీ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. అయితే సాధారణంగా అందరు క్రికెటర్ల లాగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గానే ఉండడు. కానీ ధోని మాత్రం అలా కాదు ఎప్పుడో ఒకసారి మాత్రమే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అందుకే మహేంద్రసింగ్ ధోని పెట్టే పోస్టులకు తెగ క్రేజ్ ఉంటుంది.

 ఇక మైదానంలో మిస్టర్ కూల్ కెప్టెన్సీలో ప్రేక్షకులందరినీ ఆకర్షించే మహేంద్రసింగ్ ధోని తన ఫార్మ్ ఇంల్యాండ్ లో  రైతుగా కూడా మారి ఎన్నో సార్లు అభిమానులను అలరించారు. ఇది ఇప్పుడు ధోనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోని కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల రెండు వేల కోడి పిల్లలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చాడు. మాంసకృత్తులు పుష్కలంగా లభించే కడక్ నాథ్ కోళ్ల పెంపకంపై భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తి కనబరుస్తూ ఉన్నాడు.


 ఈ మేరకు మధ్యప్రదేశ్లోని ఓ జిల్లాలోని సహకార సంస్థలకు రెండు వేల కోడి పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన స్వస్థలమైన రాంచి కి ఈ కోడి పిల్లలను పంపినట్లు తెలుస్తోంది. ధోనీ లాంటి ప్రముఖులు కడక్నాథ్ కోళ్లు పెంచేందుకు ముందుకు రావడం స్వాగతించదగ్గ విషయం అంటూ సహకార సంస్థ ప్రతినిధులు తెలిపారు. కటక్ నాథ్ కోడి పిల్లల కోసం ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు అంటూ సూచించారు. ఇక ఈ కోళ్ళ కారణంగా పెద్ద ఎత్తున గిరిజనులకు మేలు జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఇలాంటి ఆర్డర్ లు ధోని చేశాడని కానీ బర్డ్ ఫ్లూ కారణంగా సరఫరా చేయలేదని సదరు సహకార సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: