అయ్యో.. రోహిత్ సేనకు ఎంత దుస్థితి వచ్చింది?
నిన్నటి వరకు ఆరు మ్యాచ్ లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అయినా విజయం సాధిస్తుంది అని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ చెన్నై జట్టు చేతిలో కూడా పేలవ ప్రదర్శనతో ఓటమి చవి చూసే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఏకంగా ఏడు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్లో కూడా గెలవకుండా ఏడు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అపఖ్యాతిని మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఆడిన తొలి 7 మ్యాచ్ లలో వరుసగా ఓడిపోయిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
2022 ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా మార్చి 27వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాజస్థాన్, కోల్కతా,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. ఇక ఇటీవల చెన్నై చేతిలో కూడా పరాజయం పాలైంది. ఐపీఎల్లో ఆరంభ 7 మ్యాచ్లలో ఓడిపోయింది. అంతకుముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ 2013లో ఆర్సీబీ 2019 సీజన్ ఆరంభం లో మొదటి ఆరు నెలలు మాత్రమే ఓటమిపాలైన జట్లుగా కొనసాగాయ్. కానీ ఇప్పుడు మాత్రం ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసింది ముంబై ఇండియన్స్..