వామ్మో.. రవీంద్ర జడేజా ఇలా చేయడం ఏంటి?
భారత జట్టులో కీలక ఆల్రౌండర్గా ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. అయితే ప్రపంచంలోనే మేటి ఫీల్డర్ లలో రవీంద్ర జడేజా మొదటి వరుసలో ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీలింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇక రవీంద్ర జడేజా పట్టే క్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి రవీంద్ర జడేజా ఇటీవలే ముంబైలో జరిగిన మ్యాచ్ లో మాత్రం రెండు సులభమైన క్యాచ్ లు వదిలి పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొదట శాన్ట్నర్ బౌలింగ్లో బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్ అందుకోలేక వదిలేసాడు జడేజా.
ఆ తర్వాత హృతిక్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ ను నేలపాలు చేసిన జడేజా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. గతంలో అసాధ్యమైన క్యాచ్ లను సైతం అలవోకగా పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా ముంబై తో జరిగిన మ్యాచ్ లో తేలికైన క్యాచ్ లను వదిలేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం జడేజా ఒక్కడి లోనే కాదు చెన్నై ఫీల్డర్లు అందరూ కూడా ఎందుకో నిన్ను ముంబైలో జరిగిన మ్యాచ్లో తడబాటు కనిపించింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ బ్రావో సైతం తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్ జారవిడిచాడు. తర్వాత అతడు మెరుపు వేగంతో పరుగులు చేశాడు.